దుర్వాసన వెదజల్లుతున్నా పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం రుద్రారం గ్రామంలోని 8,9వ వార్డుల్లోని డ్రైనేజీల్లో చెత్త,చెదారంతో నిండిపోయి, పై వార్డుల నుంచి వచ్చే మురుగునీరు రోడ్లపై ప్రవహించడంతో కంపు దుర్వాసన వేదజల్లుతొందని ప్రజలు వాపోతున్నారు. డ్రైనేజీలు శుభ్రం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు,అధికారులకు పాలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డ్రైనేజీల్లో ప్రవహిస్తున్న మురుగునీటికి తోడుగా సోమవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి రోడ్డు చిన్నపాటి చేరువును తలపించేలా మారడంతో ప్రజలు,బాటసారులు రాకపోకలకు ఇబ్బందులకు గురివుతున్నట్లుగా వాపోతున్నారు. అసలే వర్షకాలం ప్రారంభం నేపథ్యంలో ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు జారీపడే ప్రమాదం పొంచివుందని చెబుతున్నారు.వర్షాకాలంలో ప్రజాప్రతినిధులు,అధికారులు అప్రమత్తంగా ఉండాలని,గ్రామాల్లో పారిశుధ్యంపై ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని ఇటీవల జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చెసిన పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం విడ్డురంగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి డ్రైనేజీలు, రోడ్డు శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు.



