నవతెలంగాణ – కాటారం
కాటారం మండలం గుమ్మల్లపల్లి సమీపంలోని విలాసాగర్–గుమ్మల్లపల్లి రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన సూరం తిరుమల్ రెడ్డి (42) ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.
గూడూరు గ్రామానికి చెందిన వేము నూరి అరుణ్ కుమార్ తన మేనమామ తిరుమల్ రెడ్డితో కలిసి బైక్‌పై మంథనికి వెళ్లి న్యాయవాదితో భూ వివాద విషయమై చర్చించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గుమ్మల్లపల్లి సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో వెనుక కూర్చున్న తిరుమల్ రెడ్డి ఎగిరిపడి పక్కనే ఉన్న బావిలో పడిపోయాడు. బైక్ నడుపుతున్న అరుణ్ కుమార్ రోడ్డుపై పడిపడి స్పృహ కోల్పోయాడు.
గంటన్నర తర్వాత స్పృహలోకి వచ్చిన అరుణ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా తిరుమల్ రెడ్డి బావిలో పడినట్లు గుర్తించారు. అర్ధరాత్రి వరకు బావిలో శవం తేలియాడుతూ ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తల్లి బుచ్చమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కాటారం ఎస్‌ఐ ఆకుల శ్రీనివాస్ తెలిపారు.



