Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న ఆదర్శ పాఠశాల 

జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న ఆదర్శ పాఠశాల 

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు 
నెల్లికుదురు విద్యార్థులు విజ్ఞాన ప్రతిభను పెంపొందించుకోవడానికి గైడ్ టీచర్ల ప్రోత్సాహంతో అంచలంచలుగా అభివృద్ధి చెందుతూ ఆదర్శ పాఠశాల జిల్లాస్థాయిలో సైన్స్ టాలెంట్ టెస్ట్ లో ప్రథమ స్థానంలో నిలిచిందని ఎంఈఓ రాందాస్ తెలిపారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఎఫ్ పి ఎస్ టి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అనిల్ అధ్యక్షతన జరిగిన టాలెంట్ టెస్ట్ లో జిల్లాలోని 18 మండలాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ క్రమంలో నెల్లికుదురు ఆదర్శ పాఠశాల 9వ తరగతి విద్యార్థి సింగరం దీక్షిత్ ప్రథమ స్థానాన్ని గెలుచుకున్నాడు.

జిల్లాస్థాయిలో విజ్ఞాన ప్రతిభ కనబరిచి మండలానికి పేరు తెచ్చిన సింగరం దీక్షిత్ కి మండల విద్యాశాఖ అధికారి రాందాస్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ఉపేందర్రావు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయికి మరిన్ని పోటీలలో పాల్గొని రాష్ట్రస్థాయిలో నెల్లికుదురు పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఈ పోటీలలో విద్యార్థుల వెంట మండల ఇంచార్జ్ గైడ్ టీచర్  బేతమల్ల బిక్షపతి, గైడ్ టీచర్ జ్యోతి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -