- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో సార్వజనిక శివ జన్మోత్సవ్ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి మహోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సార్వజనిక శివ బ్రహ్మోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యేకు గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి శాలువాతో ఘనంగా సత్కరించాడు. ఈ కార్యక్రమం గ్రామస్తుల ఆధ్వర్యంలో విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



