98 శాతం పూర్తి వైద్యాధికారి వినయ్ భాస్కర్
నవతెలంగాణ – మల్హర్ రావ
జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మండలంలో పల్స్ పోలియో 98 శాతం పూర్తియై విజయవంతమైయిందని మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వినయ్ భాస్కర్ తెలిపారు.తాడిచెర్ల, మల్లారం, కొయ్యుర్, చిన్నతూoడ్ల,పెద్దతూoడ్ల,ఎడ్లపల్లి గ్రామాల్లో సర్పంచ్లు బండి స్వామి,మేకల రాజయ్య,కొండ రాజమ్మ,గడ్డం క్రాoతి,బండారి నర్సింగం,జంగిడి శ్రీనివాస్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాలను ప్రారంభించారు.మండలంలో అన్ని గ్రామాల్లో మొత్తం 1591 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉండగా ఆదివారం 1560 మందికి పోలియో వేసినట్లుగా వైద్యాధికారి తెలిపారు.మండలంలో మొత్తం 22 ఉండగా ఒక మొబైల్ టీమ్,ఒక టాన్సిల్ పాయింట్,ముగ్గురు సూపర్ వైజర్స్,95 మంది వైద్య, అంగన్ వాడి సిబ్బంది పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా తెలిపారు. మిగతా 31 మంది చిన్నారులకు 29,30 తేదీల్లో సిబ్బంది ఇంటింటా తిరుగి వేస్తారని చెప్పారు.
మల్హర్ లో పల్స్ పోలియో విజయవంతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



