Monday, June 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల పరిధిలోని గ్రామాలలో దంచికొట్టిన వాన

మండల పరిధిలోని గ్రామాలలో దంచికొట్టిన వాన

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పలు గ్రామాలలో సోమవారం వాన దంచి కొట్టింది. జుక్కల్, బస్వాపూర్, పడంపల్లి , నాగల్ గావ్ , లాడే గావ్, లొంగన్, పెద్ద ఏడ్గిలలో భారీ వర్షం పడింది. వర్షాకాలం ప్రారంభం నుంచి భారీ వర్షాలు పడకపోవడం, అడపాదప వర్షాలు పడినప్పటికీ భూమికి సరిపోయేంత నీరు ఇంకా లేదని దిగాలుగా ఉన్న రైతులు నేడు పడిన వర్షానికి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి భారీగా వర్షం కురవడంతో రైతన్నలు ఆనందంతో పొంగిపోయారు. ఎప్పుడెప్పుడా అని వర్షం కోసం ఎదురుచూస్తున్న మండల రైతులకు నేటి వర్షంతో ఉపశమనం కలిగిందని అంటున్నారు. ఖండేబల్లూర్, మహ్మదాబాద్, కేమ్ రాజ్ కల్లాలి , డోన్ గావ్, హంగర్గ, మాదాపూర్ , చెండేగావ్ గుల్ల, సోపు గ్రామాలలో వర్షాలు పడలేదని ఆయా గ్రామాల రైతులు తెలిపారు. ఇప్పటికే విత్తనాలను వేసుకున్న రైతులు మొలకలు తొందరగా వస్తాయని, వర్షం పడకపోతే రైతుల అధోగతిగా ఉండేవారని నేటి వర్షం రైతులకు ఆర్థికంగా ఎంతో బలం చేకూర్చిందని రైతులు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -