Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అందరి సహకారంతోనే గ్రామాభివృద్ది: సర్పంచ్

అందరి సహకారంతోనే గ్రామాభివృద్ది: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
గ్రామస్తులతో గ్రామ అభివృద్ధి పనులను నిర్వహించాలని నాగల్ గావ్ గ్రామ సర్పంచ్ జాదవ్ సునంద బాబు పటేల్ అన్నారు. శనివారం గ్రామ సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిపి కార్యదర్శి లింగురామ్ పలు అంశాలను విశ్లేషించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అందరు సహకరించాలని ఆయన కోరారు. శానిటేషన్ పనులను, నీటినీ సమస్యలు, ఉపాధి హామీ పనులను అత్యధికంగా కూలీలు వచ్చే విధంగా, పాఠశాలలో విద్య నైపుణ్యాన్ని చాటేందుకు సహకారం పలు ఆసక్తికరమైన విషయాలు చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, జరిపి కార్యదర్శి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -