Thursday, July 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్ సర్వేను విజయవంతం చేయాలి: డోన్ గావ్ సర్పంచ్

సర్ సర్వేను విజయవంతం చేయాలి: డోన్ గావ్ సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని డోన్ గావ్ గ్రామపంచాయతీ కార్యాలయంలో  ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే( SIR) ప్రత్యేక సమావేశం గ్రామ సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్ అధ్యక్షతన విజయవంతంగా నిర్వహించబడింది అని జీపి కార్యదర్శి కే. అంజయ్య ,యూ. జీపీఓ లలిత తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఓటర్ల ప్రత్యేక సమగ్ర సర్వే ప్రక్రియ( SIR ) కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, విధివిధానాలు మరియు ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన సూచనలు, వివరాలు అందించబడినాయి అని అన్నారు.

ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై సమగ్ర ఓటర్ల సర్వే కు సహకరించాలని సర్పంచ్ కోరారు. సర్వే చేస్తున్న అధికారులు ఎమ్యునేటర్ ఫారాలను గ్రామంలోని ప్రతి ఒక్క ఓటర్కు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ఇంటింటికి తిరిగి అందించారు. గ్రామం నుండి వలస వెళ్లిన వారికి ప్రతి ఒక్కరికి ఫోన్ ద్వారా సమాచారం అందించడం జరిగిందని తెలిపారు. గ్రామ ప్రజలందరూ సర్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని పూర్తి సహకారం అందించాలని  పేర్కొన్నారు . ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు మరియు సంబంధిత అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తమ వంతు సహకారం అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -