కొన్ని ఆహార పదార్థాలు శరీరానికి మంచి చేయకపోగా చెడును చేస్తుంటాయి. ఎందుకంటే వీటిలో కత్రిమ నిల్వ పదార్థాలు (preservatives) ఎక్కువగా ఉంటాయి. కనుక వాటికి దూరంగా ఉండాలి. ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం…
బేకరీ, ప్రాసెస్ చేసిన ఆహారాలు: అన్ని రకాల బేకరీ ఉత్పత్తులు, ప్యాక్ చేసిన ఆహారాలు.
సాసులు, స్ప్రెడ్‌లు: సాసులు, ఫ్రూట్ జెల్లీలు, జాములు, మయోన్నైస్.
తీపి పదార్థాలు: తెల్ల చక్కెర, శుద్ధి చేసిన చక్కెర (refined sugar), ఐస్ క్రీమ్, బటర్‌స్కాచ్, కొబ్బరి బార్.
సూప్‌లు, చట్నీలు: క్రీమ్ సూప్‌లు, చట్నీలు, ఊరగాయలు.
జంక్ ఫుడ్, నూనె పదార్థాలు: జంక్ ఫుడ్, డీప్ ఫ్రై చేసిన ఆహారాలు (నూనెలో బాగా వేయించినవి).
మసాలాలు: అధిక మసాలా, ఎక్కువ ఉప్పు ఉండే ఆహారాలు.
జీవనశైలి – ఆహార నియమాలు
వ్యాయామం: రోజుకు కనీసం 30 నిమిషాల పాటు నడక (walking) సాగించాలి.
పండ్లు: పండ్ల రసాలు (fruit juices) తాగడం కంటే నేరుగా పండ్లనే ఎక్కువగా తినాలి. రోజుకు రెండు రకాల సీజనల్ పండ్లను (ఆయా కాలాల్లో దొరికే పండ్లు) తప్పకుండా తీసుకోవాలి.
భోజనం: భోజనం మానేయడం, ముఖ్యంగా ఉదయం అల్పాహారం (tiffins) మానేయడం వంటివి అస్సలు చేయకూడదు. ఉపవాసాలు అస్సలు చేయవద్దు (నో ఫాస్టింగ్).
నీరు: రోజుకు 6 నుండి 8 గ్లాసుల నీరు, డిటాక్స్ వాటర్ (detox water) కూడా తీసుకోవచ్చు.
అవిసె గింజలు: రోజుకు టీస్పూన్ అవిసె గింజలను తీసుకోవాలి.
హెర్బల్ టీ (కషాయం) తయారీ
మూడు కప్పుల నీటిలో అర టీస్పూన్ చొప్పున సోంపు, కొత్తిమీర, జీలకర్ర వేయండి. ఆ నీరు మరుగుతూ ఒక కప్పు వచ్చే వరకు బాగా మరిగించి వాటిని తాగాలి.
మాంసాహారం, ప్రొటీన్లు
మాంసాహారం: వైద్యుల సూచన ప్రకారం మాంసాహారాన్ని పూర్తిగా మానేయాలి.
శాకాహార ప్రొటీన్: శరీరానికి కావలసిన ప్రొటీన్లను తగిన మోతాదులో శాకాహార వనరుల ద్వారా తీసుకోవాలి.
గమనిక
మీ ఆరోగ్య స్థితికి సరిపోయే పూర్తి డైట్ చార్ట్ (Diet chart) కోసం మీ డాక్టర్ లేదా డైటీషియన్ల సలహాలను తీసుకుంటే మంచిది.
వాణి అయోధ్య క్లినికల్ డైట్ కన్సల్టంట్
9959361180



