Tuesday, July 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపోలీసు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట

పోలీసు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట

- Advertisement -


డీజీపీ సి.వి. ఆనంద్‌ వెల్లడి
పోలీస్‌ వెల్ఫేర్‌ సొసైటీ, ఆరోగ్య భద్రత పథకాలపై సమగ్ర సమీక్ష
విద్య, వైద్యం, వివాహ సహాయం, బీమా పథకాల బలోపేతానికి ఆదేశాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమమే తెలంగాణ పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్‌ స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్‌ వెల్ఫేర్‌ సొసైటీ, ఆరోగ్య భద్రత విభాగాల సమీక్ష సమావేశంలో సంక్షేమ పథకాల అమలు, వాటి పురోగతి, భవిష్యత్‌ కార్యాచరణపై విస్తృతంగా సమీక్షించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారి కుటుంబాలకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పించేందుకు శాఖ అనేక సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. పోలీసు పిల్లల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు, మెరిటోరియస్‌ స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే జేఈఈ, నీట్‌తో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక ఆర్థిక సహాయం, స్కాలర్‌షిప్‌లు అందిస్తూ ఉన్నత విద్యను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సిబ్బందికి వివాహ రుణాలు, వైద్య రుణాలు, విద్యా రుణాలు, మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు, మెరిటోరియస్‌ స్కాలర్‌షిప్‌లు, అదనపు కార్పస్‌ ఇన్సూరెన్స్‌, వివిధ గ్రాంట్లు వంటి సంక్షేమ పథకాల ద్వారా సమగ్ర ఆర్థిక భద్రత కల్పిస్తున్నట్టు డీజీపీ వివరించారు. ఈ సమావేశంలో లా అండ్‌ ఆర్డర్‌ డీజీ మహేశ్‌ ఎం. భగవత్‌, ఏడీజీ సంజరు జైన్‌, ఐజీ (మల్టీజోన్‌-2) షానావాజ్‌ ఖాసిం, ఐజీ (ప్రొవిజన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌) గజరావు భూపాల్‌, పోలీస్‌ వెల్ఫేర్‌, ఆరోగ్య భద్రత కార్యదర్శి ఉదరు కుమార్‌ రెడ్డి, ఫైనాన్స్‌ అడ్వైజర్‌ శరత్‌ కుమార్‌, తెలంగాణ పోలీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు గోపీ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -