Saturday, August 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుదాం

ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుదాం

- Advertisement -

లేబర్‌ ‌కోడ్‌‌లు, వీబీ గ్రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
దేశంలో దోపిడీ పాలన సాగుతోంది : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య
బస్వాపురంలో రాసాల వెంకటేశం ప్రథమ వర్ధంతి సభ
స్మారక స్థూపం ఆవిష్కరణ
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్

​కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం గ్రామంలో గురువారం రాత్రి సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ కామ్రేడ్ రాసాల వెంకటేశం ప్రథమ వర్ధంతి సందర్భంగా స్మారక స్తూపాన్ని పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య, జిల్లా కార్యదర్శి యండి. జహంగీర్‌‌తో కలిసి జాన్ వెస్లీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జాన్‌‌వెస్లీ ప్రసంగిస్తూ సమాజంలో దోపిడీ పోవాలని, ఎర్రజెండా రాజ్యం రావాలని, ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ‌అమరజీవి కామ్రేడ్ రాసాల వెంకటేష్ అని చెప్పారు… నరేంద్రమోడీ ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నీట్ పరీక్షలో జరిగిన తప్పులపై చర్యలు తీసుకోవాలని పోరాటం చేసిన విద్యార్థులు, యువకులపై నిర్బంధం కొనసాగిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ ‌శక్తులకు అనుకూలంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను, వీబీ గ్రామ్ జీ పథకాన్ని రద్దు చేయాలని, విద్యుత్, విత్తన, జాతీయ ఆహార భద్రత చట్టాల సవరణలను విరమించుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను వ్యాపారంగా మారుస్తూ పేదలను వాటికి దూరం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు.
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య మాట్లాడుతూ.. ఎర్రజెండా నాయకత్వంలో పరిపాలన కొనసాగిస్తున్న అనేక చిన్న దేశాలు, ప్రపంచంలో అతిపెద్ద దేశంలో కూడా ప్రజలకు అన్ని రకాలైన సౌకర్యాలు కల్పిస్తున్నాయని తెలిపారు. కానీ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారతదేశంలో దోపిడీ తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలం తప్ప పేదల సంక్షేమం ఈ ప్రభుత్వాలకు పట్టడం లేదని విమర్శించారు. సమాజంలో కొనసాగుతున్న దోపిడి పోవాలన్నా, హక్కులు పరిష్కారం కావాలన్నా ఎర్రజెండాతోనే సాధ్యమవుతుందన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి యండి జహంగీర్ మాట్లాడుతూ.. బస్వాపురం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతుల పక్షాన, ముంపునకు గురైన వివిధ గ్రామాల ప్రజల పక్షాన కామ్రేడ్ వెంకటేశం పోరాడారని గుర్తు చేశారు. సర్పంచిగా గ్రామాభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, వెంకటేష్ కుమారుడు శ్రీకాంత్ మాట్లాడారు. ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర, పల్లెసుద్దుల కళారూపాలను ప్రదర్శించారు. సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి మచ్చ భాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన సభలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, బూరుగు కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, కుటుంబ సభ్యులు, గ్రామ మాజీ సర్పంచ్ రాసాల నిర్మల, శ్రీశైలం, గ్రామ సర్పంచ్ బిక్షపతి, గడ్డం వెంకటేష్, మాయ కృష్ణ, అన్నంపట్ల కృష్ణ, మధ్యపురం బాల్ నరసింహ, బాబు, చంద్రయ్య, విష్ణు, దేవేందర్, కృష్ణ, రహెమాన్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -