Saturday, August 8, 2026
E-PAPER
Homeక్రైమ్లైంగికదాడి కేసులో నలుగురికి రిమాండ్‌

లైంగికదాడి కేసులో నలుగురికి రిమాండ్‌

- Advertisement -

నవతెలంగాణ – మల్యాల
​యువతిని బెదిరించి లైంగికదాడి చేసిన నలుగురు దుండగులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌‌కు తరలించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. ఇందుకు సంబంధించి మల్యాల సీఐ రాజ్‌‌కుమార్‌ ‌తెలిపిన వివరాల ప్రకారం.. మల్యాల మండలం నూకపల్లి గ్రామ సమీపంలోని డబుల్‌ ‌బెడ్‌‌రూం ఇండ్ల వద్దకు ఓ యువతి, యువకుడు వచ్చారు. ఇదే అదనుగా భావించిన నలుగురు వ్యక్తులు ఆ యువతి వీడియోలు తీసి నెట్‌‌లో పెడుతామని బ్లాక్‌‌మెయిల్‌‌ చేశారు. ఆమెపై లైంగిక దాడి చేశారు. ఈ ఘటన ఈ నెల 3న జరగ్గా.. బాధితురాలు గురువారం మల్యాల పోలీస్‌‌స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితులు శివరాత్రి నరేష్, గుర్రం శ్రీకాంత్, మారవేని మల్లేశం, గుర్రం అంజయ్యను శుక్రవారం అరెస్టు ‌చేసి రిమాండ్‌‌కు తరలించారు. వీరిపై గతంలోనూ పలు కేసులున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -