Friday, March 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాముడి ఆశీర్వాదంతో ప్రజలు సురక్షితంగా ఉండాలి: ఎమ్మెల్యే రేవూరి

రాముడి ఆశీర్వాదంతో ప్రజలు సురక్షితంగా ఉండాలి: ఎమ్మెల్యే రేవూరి

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు 
శుక్రవారం ఆత్మకూరు మండలం గుడెప్పాడ్, ఆత్మకూరు, పెద్దాపురం, అక్కంపేట, నాగయ్య పల్లి గ్రామాల్లో నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పింరాములోని ఆశీర్వాదంతో ప్రజల సురక్షితంగా ఉండాలి : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి.చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో పరకాల నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ బీరం సునంద సుధాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు, కాంగ్రెస్ అధ్యక్షులు కమలాపురం రమేష్, మండల సమన్వయ కమిటీ సభ్యులు కంచ రవికుమార్ ,ఏడుకొండ రవీందర్, ఆయా గ్రామాల సర్పంచులు , పాలకవర్గం ఆలయ కమిటీ సభ్యులు,  భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -