ఈనెల 15 వరకు స్వీకరణ :
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో దరఖాస్తుల స్వీకరణ గడువును ఆగస్టు 15వ తేదీ వరకు పొడిగించినట్టు రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వరుస సెలవుల నేపథ్యంలో దరఖాస్తుదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువు పొడిగించినట్టు చెప్పారు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పథకం ద్వారా లక్ష ఇండ్లను నిర్మిస్తున్నామని, అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా 16 నియోజకవర్గాల్లో 7,340 ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టామని ఆయన వివరించారు. సోమవారం నాటికి 46,121 దరఖాస్తులు అందినట్టు మంత్రి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచినప్పటికీ, దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ, కేటాయింపు, లాటరీ తదితర ప్రక్రియల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ఈ నెలాఖరు నాటికి ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇళ్ల కేటాయింపు ప్రక్రియపై దరఖాస్తుదారులు ఎటువంటి అపోహలు, అనుమానాలకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా ఇళ్ల కేటాయింపు ప్రక్రియను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
నియోజకవర్గాల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలిలా ఉన్నాయి.
అంబర్‌పేట (3,073)
బహదూర్‌పుర (1,706)
ఇబ్రహీంపట్నం (1,031)
కార్వాన్ (2,184)
ఖైరతాబాద్ (5,518)
కూకట్‌పల్లి (6,615)
మహేశ్వరం (734)
మలక్‌పేట (3,609)
మల్కాజిగిరి (1,333)
మేడ్చల్ (1,668)
నాంపల్లి (4,372)
కుత్బుల్లాపూర్ (5,571)
రాజేంద్రనగర్ (2,060)
సనత్‌నగర్ (1,404)
కంటోన్మెంట్ (1,755)
శేరిలింగంపల్లి (3,488)
‘ఇందిరమ్మ ఇండ్లు టవర్స్’ దరఖాస్తు గడువు పొడిగింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



