నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ ఆరంభ పోరులో ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఓపెనర్లు అజింక్యా రహానే(67), ఫిన్ అలెన్(37) శుభారంభమిచ్చారు. వాంఖడేలో ముంబై బౌలర్లను బెంబేలెత్తిస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఆ తరువాత కెమెరున్ గ్రీన్ (18) తక్కువ పరుగులకే వెనుదిరగగా రఘువంశీ (51) అధ్బుత అర్దసెంచరీతో ఆలరించాడు. రింకు సింగ్ (33) పరుగులు చేయడంతో కోల్ కతా జట్టు నిర్ణిత 20 ఓవర్లకు 220 భారీ స్కోరు నమోదు చేసింది. దీంతో ముంబై జట్టుకు 221 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై బౌలర్లతో శార్దుల్ ఠాకుర్ మూడు వికెట్లు తీయగా పాండ్యా ఒక వికెట్ తీశాడు.
కోల్‌కతా బ్యాటర్ల విధ్వంసం..ముంబైకి భారీ లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



