Friday, August 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరేషన్‌‌ షాపుల్లో 14రకాల నిత్యావసర సరుకులివ్వాలి

రేషన్‌‌ షాపుల్లో 14రకాల నిత్యావసర సరుకులివ్వాలి

- Advertisement -

సీఎం రేవంత్‌‌రెడ్డికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ లేఖ
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో పాటు పేదలకు 14 రకాల నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ డిమాండ్‌ ‌చేశారు. గురువారం ఈ మేరకు సీఎం రేవంత్‌‌రెడ్డికి ఆయన ఒక లేఖ రాశారు. ప్రస్తుతం రేషన్‌ కార్డుపై ఒక వ్యక్తికి ఆరు కేజీల బియ్యం మాత్రమే అందుతున్నాయనీ, పెరిగిన ధరలకు అనుగుణంగా పేద కుటుంబాల ఆదాయాలు పెరగకపోవడంతో, వారు పౌష్టికాహారానికి దూరమవుతున్నారని తెలిపారు. రక్తహీనత, పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనీ, పేదలకు పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం తక్షణమే రేషన్ కార్డుదారులకు న్యూట్రీషియన్లతో సంప్రదించి బియ్యంతో పాటు కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మంచినూనె, గోధుమలు/గోధుమ పిండి, కోడిగుడ్లు, మిల్లెట్స్, చక్కెర, చింతపండు, పసుపు, కారంపొడి, ఉప్పు, కొబ్బరినూనె ఇలా మొత్తం 14 రకాల నిత్యావసర సరుకులను రేషన్ కార్డు ద్వారా పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -