- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈ ఏడాది జనవరి 29న హుజూరాబాద్‌లో సమ్మక్క జాతర వేళ గొడవ చోటుచేసుకుంది. పోలీసుల విధుల్లో అడ్డంకి, దూషణలు, మతవిద్వేష వ్యాఖ్యలు చేసినట్లు కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు అయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. కౌశిక్‌రెడ్డితో పాటు ఆయన భార్య శాలినిరెడ్డి సైతం హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు.
- Advertisement -



