Wednesday, August 19, 2026
E-PAPER

ప్చ్‌…!

- Advertisement -

ట్రంప్‌ పనితీరుపై పెదవి విరుపు
తాజా పోల్‌లో దారుణంగా పడిపోయిన రేటింగ్‌
వాషింగ్టన్‌ :
మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాలనపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్‌ పదవీకాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన ప్రతిష్ట దిగజారిపోయింది. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం ఇప్పుడప్పుడే ముగియబోదని, అది దీర్ఘకాలం కొనసాగుతుందని మెజారిటీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. రాయిటర్స్‌/ఇప్సాస్‌ నిర్వహించిన పోల్‌ ప్రకారం…అధ్యక్షభవనంలో ట్రంప్‌ పనితీరుపై కేవలం 33 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయగా 64 శాతం మంది పెదవి విరిచారు. ఈ నెల ప్రారంభంలో ట్రంప్‌ పాలనకు 35 శాతం మంది ఓకే చెప్పగా ఇప్పుడు ఆ రేటింగ్‌ మరింత దిగజారింది. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్‌ రేటింగ్‌ ఇంతలా పడిపోవడం ఇదే మొదటిసారి. 2017 డిసెంబరులో…అంటే ట్రంప్‌ తొలి పాలనలో కూడా రేటింగ్‌ ఇదే స్థాయిలో పడిపోయింది.

మిత్రదేశమైన ఇజ్రాయిల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులకు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ట్రంప్‌ ప్రజాదరణ బాగా దెబ్బతిన్నది. పెరిగిన పెట్రో ధరలు అమెరికా కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతానని, దీర్ఘకాలిక యుద్ధాలను నివారిస్తానని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ట్రంప్‌ వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యారు. ఇరాన్‌లో అమెరికా ప్రమేయం దీర్ఘకాలం కొనసాగుతుందని ఏకంగా 80 శాతం మంది అమెరికన్లు..వీరిలో 87 శాతం మంది డెమొక్రాట్లు, 71 శాతం మంది రిపబ్లికన్లు…అభిప్రాయపడ్డారు. యుద్ధం కొన్ని వారాలలోనే ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది కేవలం 16 శాతం మంది మాత్రమే. దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో డెమొక్రాట్ల పనితీరే మెరుగ్గా ఉంటుందని 38 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడగా రిపబ్లికన్ల వైఖరిని 35 శాతం మంది సమర్ధించారు. ప్రజల జీవన ప్రమాణాలను కూడా డెమొక్రాట్లే మెరుగుపరుస్తారని మెజారిటీ ఓటర్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -