Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబేద్కర్ స్ఫూర్తితో సమానత్వ సమాజం కోసం కృషి చేయాలి

అంబేద్కర్ స్ఫూర్తితో సమానత్వ సమాజం కోసం కృషి చేయాలి

- Advertisement -

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
నవతెలంగాణ – వర్ధన్నపేట
వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం ఇల్లంద గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారుఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూడాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు అపారమని కొనియాడారు.

భారత రాజ్యాంగాన్ని రూపొందించడం ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన మహోన్నత నాయకుడని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే విలువలను సమాజంలో నెలకొల్పడమే ఆయన జీవిత లక్ష్యమని తెలిపారు. ఆయన ఆలోచనలు మరియు సిద్ధాంతాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. పేదలు, బలహీన వర్గాలు, అణగారిన ప్రజల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.

విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని ఆయన నమ్మకాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. పట్టణ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ సంఘం నాయకులు, సామాజిక కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -