నవతెలంగాణ – రెంజల్ : రైతు సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, రైతులకు యూరియా యాప్, సాగునీటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని, వారం రోజులలో సాగునీటిని వదలకుంటే అన్ని సాగర్ ప్రాజెక్టు వద్ద 50వేల మంది రైతులతో బయట ఇస్తామని ఆయన హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రమైన రెంజల్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండ గట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. ఆరోగ్యారెంటీ ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు నయా పైసా కూడా ఇవ్వలేకపోయారని ఆయన విమర్శించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సాగునీటి విషయంలో తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. వర్షాభావ పరిస్థితులు అనుకూలించక వరి పంట పండించిన రైతులకు ప్రస్తుత తరుణంలో సాగునీరు అవసరమని, వారం రోజులలో అల్లి సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటి అందించకపోతే సుమారు 50 వేల మంది రైతులు ప్రజలతో కలిసి ప్రాజెక్టు వద్ద పరిటాల ఇస్తామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, చేయూత పెంచలన 4000ల కు పెంచుతామని ఇంతవరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. బిజెపి ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు కేటాయించి ఆయా నియోజక వర్గాలను అభివృద్ధి చేసుకోవాలని విభజించే పాలించడం ఎంతవరకు సమంజసం అని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ పాలనలో మహిళా సోదరి మణులకు ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం జరిగితే కేసిఆర్ కిట్టు త పాటు 12,000 రూపాయల ఆర్థిక సాయం చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందన్నారు.
ప్రభుత్వం అధికారాన్ని చేదు ఎక్కించుకొని 1000 రోజులు పూర్తయినప్పటికీ ఇంతవరకు ప్రజలకు సంక్షేమ ఫలాలను ఇవ్వలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సభకు వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు రావడంతో ఆయన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శేషు గారి భూమారెడ్డి, నీలా సొసైటీ చైర్మన్ ఇమామ్ బేగ్, రఫిక్, కాశం సాయిలు సాటా పూర్ మాజీ సర్పంచ్ వికార్ పాషా,తిరుపతి బుజ్జి, కందకుర్తి మాజీ సర్పంచ్ మీర్జా కలీం బేగ్, మాజీ ఎంపీటీసీ అసాద్ బేగ్, ఎస్.కె అహమ్మద్, బోర్గం ఉప సర్పంచ్ పాషా, వీరన్న గుట్ట మాజీ సర్పంచ్ బైండ్ల రాజు, ఇబ్రహీం, మల్ల సాయిలు, ముఖిద్, బోర్గం మాజీ ఉప సర్పంచ్ ఫిరోజ్ ఉద్దీన్, ఖలీద్, గఫర్, జావిద్ తదితరులు పాల్గొన్నారు.



