టన్నెల్ నుంచి సజీవంగా
బయటపడిన ఇద్దరు కార్మికులు
సహాయ సిబ్బందిలో చిగురించిన ఆశలు
ఖాట్మండు : నేపాల్‌లో సంభవించిన వరదల కారణంగా త్రిశూలి 3ఏ జలవిద్యుత్ ప్రాజెక్ట్ టన్నెల్‌లో తొమ్మిది రోజుల పాటు చిక్కుబడిన ఇద్దరు కార్మికులను సహాయ సిబ్బంది రక్షించారు. విపత్తు తర్వాత ఈ టన్నెల్ ఎవరికీ కన్పించలేదు. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా బురదతో కప్పుకుపోయిన టన్నెల్‌ను సహాయ సిబ్బంది గుర్తించారు. సజీవంగా బయటపడిన 30 సంవత్సరాల సంజయ్ సాహ్ సహాయ సిబ్బందిని ‘ఈ రోజు ఏ తేదీ’ అని అడిగారు. మరో కార్మికుడు కబీర్ మహారాజన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వీరిద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఉదంతం నేపథ్యంలో సహాయ సిబ్బందిలో ఆశలు చిగురించాయి. టన్నెల్‌లో చిక్కుబడిన వారి ఆచూకీ కోసం వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వరదల కారణంగా జలవిద్యుత్ ప్లాంట్ టన్నెల్స్‌లో చిక్కుబడిన వందలాది మంది కార్మికుల ఆచూకీ తెలియడం లేదు. కాగా విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,295కి చేరింది. చైనా వరదలలో 21 మంది చనిపోయారు. రెండు దేశాలకూ చెందిన ఐదున్నర వేల మంది గల్లంతయ్యారు. నేపాల్‌లో సుమారు పది వేల కుటుంబాలకు చెందిన 43,000 మందికి అత్యవసర మానవతాసాయం అవసరమని ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) తెలిపింది. ప్రభుత్వ అంచనాల ప్రకారం 84,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు.
మృత్యుంజయులు…!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



