Monday, September 7, 2026
E-PAPER
Homeఖమ్మంకేటీఆర్‌ అరెస్టుకు నిరసనగా బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆందోళన

కేటీఆర్‌ అరెస్టుకు నిరసనగా బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆందోళన

- Advertisement -

– 420 హామీల అమలుకు ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం
నవతెలంగాణ – అశ్వారావుపేట

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు అశ్వారావుపేట మండలంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు సోమవారం ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ భారీ మోటార్‌సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులు గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను అక్రమంగా అరెస్టు చేశారంటూ నాయకులు, కార్యకర్తలు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. కేటీఆర్‌ అరెస్టును వెంటనే ఖండించాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో కాసాని పద్మ–చంద్రమోహన్‌, కౌన్సిలర్‌ డాక్టర్‌ ఉదయజ్యోతి–భూక్యా ప్రసాద్‌, జుజ్జురపు శ్రీరామ్మూర్తి, వగ్గెల పూజ, సత్యవరపు సంపూర్ణ, మోటూరి మోహన్‌, శెట్టిపల్లి రఘురాం,పాలవలస జీవన్‌ రావు,నల్లపు రామారావు, పానుగంటి లక్ష్మణ్‌రావు, రామలక్ష్మయ్య,తగరం జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, మహిళా నాయకులు, మండలవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -