Tuesday, September 15, 2026
E-PAPER
Homeఖమ్మం'సాయిస్ఫూర్తి' కళాశాలలో ఘనంగా 'ఇంజనీర్స్ డే' వేడుకలు

‘సాయిస్ఫూర్తి’ కళాశాలలో ఘనంగా ‘ఇంజనీర్స్ డే’ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి 
గంగారం సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం, యాజమాన్య సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ‘ఇంజనీర్స్ డే’ వేడుకను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ దాసరి ప్రభాకరరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ..గొప్ప దార్శనికుడు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

​దేశ, విదేశాల్లో భారత్ ఇంజనీరింగ్ ప్రతిభను చాటిచెప్పిన మహనీయుడు విశ్వేశ్వరయ్య అని ఆయన కొనియాడారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి మాట్లాడుతూ…  విశ్వేశ్వరయ్య జీవిత ఔన్నత్యాన్ని, నిస్వార్థ సేవలను విద్యార్థులకు వివరిoచారు. హైదరాబాద్‌ను వరదల నుంచి రక్షించే వ్యవస్థను,  విశాఖ రేవు సముద్రపు కోతకు గురికాకుండా రూపొందించిన విధానాన్ని ఈ సందర్భంగా ఆమె  గుర్తుచేశారు. ​ఆసియాలోనే అతిపెద్దదైన కృష్ణరాజసాగర్ ఆనకట్ట నిర్మాణం ఆయన పర్యవేక్షణలోనే జరిగిందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.

​బృందావన్ ఉద్యానవనం, భద్రావతి ఉక్కు కర్మాగారం, మైసూర్ బ్యాంక్ స్థాపనలో విశ్వేశ్వరయ్య కీలక పాత్ర పోషించారని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ యాకూబ్ మాట్లాడుతూ…  విశ్వేశ్వరయ్య క్రమశిక్షణ, దేశసేవను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. యువతలోని సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ సమాజ శ్రేయస్సుకు వినూత్న పరిష్కారాలు చూపాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యులు, హెటిరో ఫార్మా అధినేత, కళాశాల చైర్మన్ డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ బండి అన్విద  వర్చువల్‌గా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

​విద్యార్థులు నూతన సాంకేతిక ఆవిష్కరణలపై దృష్టి సారించి సమాజ మార్పునకు కృషి చేయాలని ప్రముఖులు కోరారు. ​ఈ కార్యక్రమంలో కళాశాల వివిధ విభాగాల అధిపతులు, డిప్లొమా డీన్, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్, సభ్యులు బలుసుపాటి సీతారాములు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -