
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జహీరాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేష్ షెట్కార్ బుధవారం నాడు నామినేషన్ దాఖల కార్యక్రమం చేపట్టగా, ఆయన నామినేషన్ దాఖల కార్యక్రమానికి మద్నూర్ మండలం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో సంగారెడ్డి జిల్లా కేంద్రానికి తరలి వెళ్లారు. నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్లిన వారిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రామ్ పటేల్ నాగేష్ పటేల్ శశాంక్ పాటిల్ దీన్ దయాల్ శివాజీ పటేల్ ఉమాకాంత్ పటేల్ తదితరులు వెళ్లారు.