నవతెలంగాణ – నసురుల్లాబాద్
నసురుల్లాబాద్ మండల పరిధిలో వ్యవసాయ మోటర్లకు ఏర్పా టు చేసిన మూడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి రాగి వైరును అపహరించారు. బాధిత రైతులు తెలిపిన వివరాల మేరకు నసురుల్లాబాద్ మండలంలోని మైలారం, మిర్జాపూర్ శివారులో 100 కెవి ట్రాన్స్ ఫార్మర్లను గుర్తు తెలియని ధ్వసం చేశారు. వ్యవసాయ పొలాల వద్ద 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లను వ్యవసాయ విద్యుత్ కోసం అధికారులు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ స్తంభాలపై అమర్చిన మూడు ట్రాన్స్‌ఫార్మర్లను కిందకు తోసేసి అందులోని విలువైన రాగి తీగలను తీసుకుని మిగిలిన భాగాలను పొలాల్లో వదలి వెళ్లారు. శనివారం ఉదయం పొలాల వద్దకు వెళ్లిన రైతులు ట్రాన్స్ పార్మర్ చోరీకి గురైనట్లు గుర్తించి విద్యుత్ అధికారులకు సమా చారం అందించారు. సంఘటన స్థలానికి విద్యుత్ అధికారులు చేరుకొని వివరాలను సేకరించారు. . ఒక్కొక్క 100 కేవీఏ ట్రాన్స్ పార్మరులో అపహరించిన రాగి తీగ విలువ సుమారు రూ.50 వేలు వరకూ ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. విద్యుత్ అధికారుల సూచనల మేరకు బాధిత రైతులు స్థానిక పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జరిగిన సంఘటన స్థలానికి నసురుల్లాబాద్ పోలీసులు చేరుకొని వివరాలను సేకరించారు. క్లూస్ టీం తో వేలిముద్రాలను సేకరించారు త్వరలో దుండగులను పట్టుకుంటామని ఎస్.ఐ తెలిపారు.