- Advertisement -
– పాల్గొన్న మంత్రి సతీమణి మంజుల
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ రేణుక మండల సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం మహిళ సమైక్య కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ సంబరాలలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి పొన్నం మంజుల ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మహిళా సమైక్య మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు కె.శ్రీలత, కె.స్వప్న, రేణుక, వివో ఏలు సంధ్య, రూప.కనుకతార, ఎ. పి.యం తిరుపతి ,సీసీలు పాల్గొన్నారు.
- Advertisement -