మసాల నమూనాల సేకరణ

– సింగపూర్‌, హాంకాంగ్‌ నిషేధంతో..
న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన రెండు కంపెనీల మసాల దినుసుల్లో క్యాన్సర్‌ కారకాలు ఉన్నాయని.. వాటిని నిషేధిస్తున్నామని సింగపూర్‌, హాంకాంగ్‌ ప్రకటించడంతో కేంద్రం అప్రమత్తమయ్యింది. ఈ నేపథ్యంలోనే ఎవరెస్ట్‌, ఎండిహెచ్‌ మసాల తయారీ కంపెనీలపై చర్యలకు ఉపక్రమించింది. ఆ రెండు కంపెనీలకు చెందిన అన్ని మసాలా దినుసుల తయారీ యూనిట్ల నుండి నమూనాలను సేకరించాలని ప్రభుత్వం ఫుడ్‌ కమిషనర్‌లను ఆదేశించింది. అదే విధంగా దేశంలోని అన్ని మసాల దినుసుల తయారీ యూనిట్ల నుంచి నమూనాలను సేకరిస్తున్నట్లు ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి.

Spread the love