కల్తీ కల్లు విక్రయాలపై అధికారుల నిర్లక్ష్యం

నవతెలంగాణ-గుమ్మడిదల
మండలంలోని మంబాపూర్‌ గ్రామంలో అల్ఫోజెమ్‌తో పాటు వివిధ కల్తీ మత్తు పదార్థాలు కలిపి కల్తీ కల్లు తయారు చేసి విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని పలు మార్లు ఎక్సైజ్‌ అధికారులకు తెలియజేసినా.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందరో యువకులు సైతం ఉదయం 6 గం టల నుండే ప్రారంభమైతున్న కల్తీ కల్లు సేవించి.. అక్కడే ఉన్న చెట్ల కిందనే పడుకుంటున్నారన్నారు. కొద్ది రోజుల క్రితం పక్కనే ఉన్న పంట పొలాల్లో ఆ భూ యజమాని.. పంట పొలంలో కల్లు తాగొద్దని చెప్పినందుకు అతనిపై దాడి కూడా చేశారన్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్‌ అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోవట్లేదని స్థానికులు మండిపడుతున్నారు. వెంటనే జిల్లా ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని.. కల్తీ కల్లువి కయిస్తున్న దుకాణానికి టీిఎఫ్‌ టీ లైసెన్స్‌ను రద్దు చేయాలని కోరారు.

Spread the love