ఆశీర్వదించండి..సేవకుడిగా పనిచేస్తా

– కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌ రెడ్డి
– శంషాబాద్‌లో భారీ బహిరంగ సభ
– దేశంలో మతోన్మాదానికి లౌకిక వాదానికి మధ్య ఘర్షణ
నవతెలంగాణ-శంషాబాద్‌
చేవెళ్ల గడ్డమీద మరోసారి తనను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే నిరంతరం ప్రజలకు సేవకునిగా పని చేస్తానని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌ రెడ్డి అన్నా రు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళ వారం శంషాబాద్‌ మండల కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మండల పరిధిలోని తొండుపల్లి ఎమ్మెస్‌ గార్డెన్‌లో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఈసారి ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజీవ్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతుందన్నారు. గత పదేండ్ల కాలంలో నరేంద్ర మోడీ దేశానికి చేసిన సేవ ఏమీ లేదన్నారు. కార్పొరేట్‌ శక్తులకు దేశ సంపదను తాకట్టు పెడుతూ ప్రజలను మాత్రం సంక్షోభం లోకి నెట్టారన్నారు. కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో పేదల అభ్యున్నతి సంక్షేమం అభివద్ధి పథకాల గురించి మాట్లాడితే బీజేపీి మాత్రం సంక్షేమ పథకాలను పేదలకు అందకుండా చేసి కార్పొరేట్‌ శక్తులకు సంపద పోగేయ డానికి చర్యలు తీసుకుంటుందన్నారు. మరోసారి దేశంలో బీజేపీి అధికారంలోకి వస్తే ప్రజలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్తార న్నారు.దేశవ్యాప్తంగా ఆ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నా యని అందుకే మతం, కులం ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు మోడీ కుయుక్తులు పన్నుతు న్నార న్నారు. మోడీ చేస్తున్న అరాచకాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్‌ రెడ్డి ఈ ప్రాంతానికి చేసిన సేవ ఏమీ లేదన్నారు. ఆయన ప్రజలను గుర్తుపట్టరని దగ్గరకు వెళ్లాలంటే అపాయింట్మెంట్‌ తీసుకోవాలన్నారు. అందుబా టులో ఉండని సేవ చేయని కొండను గెలిపించడం వల్ల ఈ ప్రాంతానికి నష్టమే తప్ప ఎలాంటి లాభమూ లేద న్నారు. చేవెళ్ల గడ్డమీద తనను గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవకునిగా పనిచేస్తానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వం లో తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు కచ్చితంగా అమ లు అవుతాయన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్ల స్థలాలు నిధులు కేటాయించనున్నట్లు తెలి పారు. ప్రతి సంవత్సరం నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. మహిళలకు 2500 రైతు రుణమాఫీ ఆసరా పింఛన్‌ రూ.4 వేలకు పెంచడం జరుగు తుందన్నారు విద్య వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆ దిశగా అనేక చర్యలు తీసు కుంటుందని తెలిపారు. ఎన్నికల అనంతరం సుస్థిరమైన ప్రజామోద యోగ్యమైన కాంగ్రెస్‌ నాయకత్వంలో ప్రజా పాలన అందిస్తామన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ప్రజా సంక్షేమాన్ని అభివద్ధిని కాంక్షించే కాంగ్రెస్‌ను దేశంలో అధికారంలోకి తీసుకురావాలన్నారు. తనని గెలి పిస్తే కాంగ్రెస్‌ గెలుస్తుందని ఢిల్లీ పీఠం దక్కించుకుంటుంద న్నారు. స్వాతంత్ర కాలం నుంచి కాంగ్రెస్‌ అనేక ఒడిదు డుకులను ఎదుర్కొని దేశంలో సుస్థిర అభివద్ధికి బాటలు వేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి పాడి పరిశ్రమ అభివద్ధి చైర్మెన్‌ బి. జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌, మైనార్టీ విద్య అభివద్ధి చైర్మన్‌ ఫయీం, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్‌ పల్లి నరేందర్‌, పార్టీ మండల, మున్సిపల్‌ అధ్యక్షులు గడ్డం శేఖర్‌ యాదవ్‌, పీఎస్‌ సంజరు యాదవ్‌, శంషుద్దీన్‌, సులోచన, అక్రమఖాన్‌, ధనుంజయ, ఎంపీటీసీ తొంట గౌతమి అశోక్‌, గడ్డం విజయ, లింగం ,ప్రభాకర్‌ ,మల్లేష్‌, మహేష్‌ సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love