వేసవిలో తల్లులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి

– అధికంగా నీరు తాగాలి
– పండ్లు, కూరగాయలు తినాలి
– అపోలో హాస్పిటల్స్‌ వైద్యులు డాక్టర్‌ కృష్ణ దీపిక
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
వేసవి కాలంలో చిన్న పిల్లల తల్లులు ఆరోగ్య కరమైన ఆహారం తీసుకోవాలని, అధికంగా నీరు తాగాలని అపోలో హాస్పిటల్స్‌, కొండాపూర్‌ సీని యర్‌ క్లినికల్‌ న్యూట్రిషనిస్ట్‌, లక్టేషన్‌ సలహా దారులు డాక్టర్‌ వీ. కృష్ణ దీపిక తెలిపారు. మండే ఎండలను దృష్టిలో పెట్టుకొని మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వేసవి కాలం వివిధ రకాల పండ్లు, కూరగాయలు తినడానికి అద్భు తమైన సమయమన్నారు. హైడ్రేటెడ్‌గా ఉండ టానికి 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలన్నా రు. పుదీనా నిమ్మరసం, ఫ్రూట్‌ స్మూతీస్‌, జీరా మజ్జిగ, లేత కొబ్బరి నీరు, చెరకు రసం తీసుకోవ డం ద్వారా ఎలక్ట్రోలైట్లు, పోషకాలను హైడ్రేషన్‌తో కలిసేలా చేస్తుందన్నారు. ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, కాల్షియం కోసం పప్పులు, సూప్‌లు, పరాటాలను ఆకు కూరలు కలిపి తినాలన్నారు. ఐరన్‌ కోసం జామ, నారింజ, మామిడి, కివి, క్యాప్సికమ్‌, టమో టాలు, నిమ్మకాయ తదితర విటమిన్‌ సీ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు ఉత్తమమన్నారు. శరీరంలో ఐరన్‌ను నిరోధించే కాఫీ వంటి కెఫిన్‌ అధికంగా ఉండే ఆహారాలు నివారించాలన్నారు. పుచ్చకాయలు, దోసకాయలు, వాటర్‌ యాపిల్‌, ఐస్‌ యాపిల్‌ తదితర అనేక హైడ్రేటింగ్‌ పండ్లు, కూరగాయలు తీసుకోవాలని, వీటిలో నీటితో పాటు విటమిన్లు, పోషకాలు, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయన్నారు. పాలు, పాల ఉత్పత్తులు అయిన పన్నీరు, పెరుగు కాల్షియంకు మూలమన్నారు. పెరుగు జీర్ణక్రియకు తోడ్పడుతుందన్నారు. సలాడ్‌లు, ఉడికించిన కూరగాయలు, క్యారెట్‌లు, బీట్‌రూట్‌లు, రంగు క్యాప్సికమ్‌లు తీసుకోవాల న్నారు. ఇవి యాంటీఆక్సిడెంట్‌లకు మూల మన్నారు. రోగ నిరోధకశక్తిని పెంచడంలో సహా యపడుతుందని తెలిపారు. మెగ్నీషియం, జింక్‌, బీ కాంప్లెక్స్‌ విటమిన్లు, విటమిన్‌ ఈ కోసం పెరు గు, క్యారెట్‌ స్టిక్స్‌, బాదం, వాల్‌నట్‌, పొద్దుతి రుగుడు, గుమ్మడికాయ గింజలతో కూడిన హమ్మ స్‌ వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ తీసుకోవాల న్నారు. బేబీ క్యారెట్లు, దోసకాయలు, ఉడికించిన స్వీట్‌కార్న్‌ వంటి సలాడ్‌లు తగినంత ఫైబర్తో మల బద్ధకం నివారణలో సహాయపడుతుందని తెలిపా రు. గర్భిణులు మధుమేహాన్ని తగ్గించడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి తృణధాన్యాలు, ఓట్స్‌, మిల్లెట్లు, సింగిల్‌ పాలిష్‌ బియ్యం వంటి కార్బోహైడ్రేట్‌లు ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు. పిజ్జా, బర్గర్లు, చిప్స్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ వంటి వేయించిన, జిడ్డు గల ఆహారాలకు దూరం గా ఉండాలన్నారు. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్‌ సమస్యలను నివారించడానికి మసాలా గ్రేవీ కూరలు, మిరప కాయలు, పుల్లని ఆహారాలు తినడం తగ్గించాల న్నారు. వేసవిలో ఉత్తమ ఆరోగ్య చిట్కాలలో ఒకటి రెడ్‌ మీట్‌, ఆర్గాన్‌ మీట్‌లను తినడం తగ్గించడం లేదా నివారించడం ఉత్తమమన్నారు. వేసవి కాలంలో ఆహారంలో ఈ చిట్కాలు పాటించడం ద్వారా మీ ఆరోగ్యం, శిశువు ఆరోగ్యం కూడా మెరుగుపరుచుకోవచ్చని తెలిపా రు. హైడ్రేటెడ్‌గా ఉండండి, సురక్షితంగా ఉండం డని పేర్కొన్నారు.

Spread the love