నోడల్‌ అధికారులతో ఎన్నికల అధికారిణి సమావేశం

నవతెలంగాణ-శేరిలింగంపల్లి
చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని శేరి లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ఎన్నికల కార్యకలా పాలపై అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, జోనల్‌ కమి షనర్‌ స్నేహా శబరీష్‌ సమీక్షించారు. బి. గోపాల్‌ రావు, పీఓ.ఉషారాణిలు స్వీప్‌ కోసం నోడల్‌ అధికారులు కాలనీ వాసులు, పాఠశాలల సిబ్బందితో ఓటరు అవగాహనా సమావేశాలు నిర్వహించారు. గేటెడ్‌ కమ్యూనిటీ, జేపీ నగర్‌లో 110 మంది విద్యార్థులు, 21 మంది ఉపాధ్యా యులు 12 మంది ఇతర సిబ్బంది, శ్రీ చైతన్య ఫ్యూచర్‌ పాత్‌ స్కూల్‌, మియాపూర్‌ నుండి స్వీప్‌ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. 4.258 మంది విద్యార్థులు, 35 మంది ఉపాధ్యాయులు, 13 మంది ఉపాధ్యాయులు, 13 మంది బోధనేతర సిబ్బంది స్వీప్‌ పాఠశాల కార్యకలాపాలలో పాల్గొ న్నారు ఏసీపీ, ఎంసీసీ నోడల్‌ అధికారి మెహ్ర నివే దించారు. 19008 రూపాయల విలువ చేసే మద్యం: 17.28 లీటర్లు, ఎక్సైజ్‌ సిబ్బంది. 26, 812.50 రూపా యల విలువ చేసే :357.5 లీటర్లు మద్యాన్ని స్వాదీనం చేసుకున్నట్లు తెలి పారు. మంగళవారం పాదయాత్రకు రెండు అను మతులు ఇవ్వబడ్డాయని ఎస్‌ఎల్‌పి జోన్‌, వ్యయ పర్యవేక్షణ కోసం జీహెచ్‌ఎంసీ నోడల్‌ ఆఫీసర్‌ విజయ కుమార్‌ తెలిపారు. గోపీనగర్‌లోని ఎం పీపీ స్కూల్‌ను వెబ్‌కాస్టింగ్‌ కోసం నోడల్‌ ఆఫీసర్‌ సి.మల్లి కార్జున్‌ తనిఖీ చేశారు. కార్యక్ర మంలో నోడల్‌ అధికారులు, మెటీరియల్‌ మేనే జ్‌మెంట్‌ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love