నవతెలంగాణ – పుణె: మహారాష్ట్రలోని పుణె నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గంగధామ్ ఏరియాలోని ఓ గోదాంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడటంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. గోదాం సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్‌ల సాయంతో మంటలను ఆర్పేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదన్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.