అంగన్ వాడిల్లో ఘనంగా వార్షికోత్సవం

నవతెలంగాణ – మల్హర్ రావు
అంగన్ వాడిల మహాదేవ్ పూర్ ప్రాజెక్టు సీడీపీఓ రాధిక,మండల సూపర్ వేజర్ సరస్వతి ఆదేశాల మేరకు మండలంలోని పెద్దతూoడ్ల (నారాయణపల్లి సెంటర్-3)లో  (గ్రాడ్యుయేషన్ డే) వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా 3నుంచి 6 సంవత్సరాల చిన్నారులతో విభిన్నమైన  వేషధారణ వేయించి ఆటలు,పాటలు,నృత్యాలు చేయించారు.ప్రీస్కూల్ విద్యార్దులకు అభివృద్ధి నివేదికలను అందించారు.అంగన్ వాడి కేంద్రాలలో చిన్నారులు మానసిక ఒత్తిడికి గురికాకుండా క్రమశిక్షణతో ఉంటారని చెప్పారు.అంగన్ వాడి కేంద్రాల ద్వారా చిన్నారులు, కిషోర్ బాలికలు,గర్బిణీలకు అనేకమైన సేవలందిస్తున్నట్లుగా తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్లు అన్నపూర్ణ,సౌజన్య, రమాదేవి,భారతి, ఆయాలు పాల్గొన్నారు.
Spread the love