బీఆర్ఎస్ 2 సీట్లు గెలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి

నవతెలంగాణ – నల్గొండ: నల్గొండ జిల్లాకి తీరని అన్యాయం చేసిన కేసీఆర్.. ఇవాళ ఏ ముఖం పెట్టుకుని మిర్యాలగూడకి వస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. నిత్యం కాంగ్రెస్‌పై విమర్శలు చేసే కేసీఆర్‌.. పార్లమెంట్‌ ఎన్నికల్లో కనీసం రెండు స్థానాల్లోనైనా గెలవాలన్నారు. భారాస రెండు సీట్లు గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ చేశారు. నల్గొండ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Spread the love