మలేరియా ప్రభావిత గ్రామంలో ఆరోగ్య శిభిరం

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట(వినాయకపురం) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మారుమూల గిరిజన మలేరియా ప్రభావిత గ్రామం అయిన గుంటిమడుగు లో వైద్యాధికారి  రాందాస్ పర్యవేక్షణలో  వైద్య శిభిరం నిర్వహించారు. 31 మందిని పరీక్షించి చిరు వ్యాధులకు చికిత్స అందించారు.జ్వర పీడితులను  గుర్తించి రక్త నమూనాలు సేకరించి మలేరియా నిర్ధారణ పరీక్ష నిర్వహించారు. సాధారణ జ్వరాలు గా బావించి చికిత్స అందించారు. గ్రామంలో  ఇంటింటి నీ సందర్శించి గృహ పరిసరాల్లో నీటి నిల్వలు తొలగించారు.ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమ తెరలు సక్రమంగా వాడాలని, కాచి చల్లార్చిన నీరు త్రాగాలని ప్రజలకు ఆరోగ్య విద్యను అందించారు. ఈ శిబిరంలో  హెచ్.ఇ.ఒ రాజు, ఎస్.యు.ఒ వెంకటేశ్వరరావు, హెచ్.ఎస్  శ్రీను, హెచ్.ఎ రవి,ఆశా కార్యకర్తలు పాల్గొన్నాను..
Spread the love