నవజాత శిశువు ఏడుపు దేనికి భావ సూచికగా భావించవచ్చు?

భారతదేశంలో నివశిస్తున్న ప్రజలందరికీ కావాల్సిన ప్రాధమిక విద్యని అందించాల్సిన బాద్యత ప్రధానంగా ప్రజలెన్నుకున్న ప్రభుత్వాల మీదే ఉంటుంది. 1976 వరకు ప్రాధమిక విద్య రాష్ట్రాల నిర్వహణలో ఉండేది. 1976వ సంవత్సరంలో భారత రాజ్యాంగంలో ప్రవేశ పెట్టిన 42వ సవరణ ద్వారా విద్య కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలోకి చేర్చబడింది. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి, భారతదేశంలోని నిరక్షరాస్యత సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలను చేపట్టింది. భారతదేశ మొదటి విద్యా మంత్రి మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ దేశీయ విద్యా రంగ అభివద్ధిలో విశేషమైన కషి చేసారు. భారతదేశ విద్యా వ్యవస్థను ఆధునీకరించడానికి కావాల్సిన ప్రతిపాదనలకు రూపకల్పన చేయటానికి అప్పటి ప్రభుత్వం యూనివర్శిటీ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ (1948-1949), సెకండరీ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ (1952-1953), యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌, కొఠారీ కమిషన్‌ (1964-66) వంటి కమిషన్‌ లని ఏర్పాటు చేసింది. నాటి నుండి విద్యా సంస్థల ఏర్పాటుతో పాటు, భోదనా పద్ధతుల రూపకల్పనకి కూడా ఈ కమిషన్‌లు అనేక ప్రతిపాదనలు చేసాయి. 2009లో అమోదించబడిన విద్యా హక్కు చట్టం దేశంలోనే 6-14 ఏళ్ళలోపు పిల్లలందరికీ ఉచిత నిర్భంద విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. దేశంలో విద్యా, బోధనా రంగాల్లో మార్పులు చేపడుతూ 2005లో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం చేయబడింది. నూతన పాఠ్యాంశాల రూపకల్పన, బోధనా పద్ధతుల్లో మార్పులు, నవీన అభ్యాసనా విధానాలు విద్యా రంగంలో ప్రవేశ పెట్టడానికి ఈ ప్రణాళిక చట్టం దోహద పడింది. 2020లో భారత కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం (NEP 2020)ని ప్రవేశపెట్టింది. 2040 నాటికి భారత దేశం సామాజిక, ఆర్ధిక రంగాలతో సంబంధం లేకుండా దేశంలో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యని అందుబాటులోకి తీసుకు రావటమే ఈ నూతన జాతీయ విద్యా విధాన లక్ష్యమని కేంద్రం ప్రకటించింది.

1. ఎక్కువ పరిణితి కలిగిన ఉపాధ్యాయుడు తనకన్నా తక్కువ పరిణితి కలిగిన విద్యార్ధుల్లో జ్ఞానాన్ని పెంచడానికి నిర్వర్తించే ప్రక్రియనే బోధన అని ఎవరు అన్నారు ?
ఎ) ఇ. ఎమిడోకో బి) బి.ఒ స్మిత్‌
సి) హెచ్‌. సి. మోరిసన్‌ డి) టి.ఎఫ్‌. గ్రీని
2. జాన్‌ డ్యూయీ ప్రకారం, విద్య యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి?
ఎ) సాంస్కతిక వారసత్వాన్ని ప్రసారం చేయడం
బి) విద్యార్థులను కెరీర్‌కు సిద్ధం చేయడం
సి) సామాజిక చలనశీలతను సులభతరం చేయడం
డి) ప్రజాస్వామ్య పౌరసత్వాన్ని ప్రోత్సహించడం
3. ఉచిత మరియు నిర్బంధ విద్య కోసం బాలల హక్కు చట్టం, 2009 ఏ వయస్సు పిల్లలకు విద్యను అందించటం తప్పనిసరి చేస్తుంది?
ఎ) 3-6 సంవత్సరాలు బి) 6-14 సంవత్సరాలు
సి) 10-18 సంవత్సరాలు డి) 14-18 సంవత్సరాలు
4. RTE చట్టం, 2009 ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు పాఠశాలలు ఎంత శాతం సీట్లను రిజర్వ్‌ చేయాలి?
ఎ) 20% బి) 25% సి) 30% డి) 40%
5. 1882లో లార్డ్‌ రిప్పన్‌ భారత దేశంలోని విద్యా రంగం సాధించిన పురోగతిని సమీక్షించడానికి ఏర్పాటు చేసిన కమిషన్‌ పేరు ఏమిటి ?
ఎ) చార్లెస్‌ వుడ్స్‌ కమిషన్‌ బి) సార్జంట్‌ కమిషన్‌
సి) హంటర్‌ కమిషన్‌ డి) హర్షెల్‌ కమిషన్‌
6. ఈ కింది వాటిలో ఏది సాక్షర భారత్‌ మిషన్‌ యొక్క ప్రధాన లక్ష్యం?
ఎ) విన్నూత్న మరియు సాంకేతికతపై దష్టి కేంద్రీకరించటం
బి) నిరక్షరాస్యులు, అంకెలు కూడా రాయటం రాని వారికి క్రియాత్మక అక్షరాస్యత ద్వార అంకెల పరిజ్ఞాం అందించటం
సి) సహజ స్వామ్యమైన విద్యను ఉద్యమ స్థాయిలో అందించటం
డి) సెకండరీ స్థాయిలో మెరుగైన విద్యను అందివ్వటానికి, సెకండరీ పాఠశాలలు అన్నిటిని నియమావళికి బద్దుల్ని చేయటం
7. సమ్మిళిత విద్యా విధానం ఈ కింది వాటిలో దేనిని ప్రోత్సహిస్తుంది?
ఎ) వైకల్యం ఉన్న పిల్లలు మాత్రమే
బి) విభిన్న నేపథ్యాలు మరియు సామర్థ్యాలు కలిగిన పిల్లలు
సి) ప్రతిభావంతులైన పిల్లలు మాత్రమే
డి) శారీరక వైకల్యాలున్న పిల్లలు మాత్రమే
8. కింది వాటిలో సమ్మిళిత విద్య గురించి ప్రబలంగా ఉన్న అపోహ ఏది?
ఎ) ఇది వికలాంగ విద్యార్థులకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది
బి) ఇది ఖరీదైనది మరియు వనరులతో కూడుకున్నది
సి) ఇది విభజనను ప్రోత్సహిస్తుంది
డి) ఇది విద్యా ప్రమాణాలను తగ్గిస్తుంది
9. సమగ్ర విద్యలో తరగతి గది నిర్వహణ ఈ కింది వాటిలో దేనిపై ఎక్కువ దష్టి సారిస్తుంది ?
ఎ) వికలాంగ విద్యార్థులను మినహాయించడం
బి) విద్యార్థులందరికీ సహాయక అభ్యాస వాతావరణాన్ని ప్రోత్సహించడం
సి) సామర్థ్యాల ఆధారంగా విద్యార్థులను వేరు చేయడం
డి) దఢమైన క్రమశిక్షణ వ్యూహాలు
10. సమగ్ర విద్యలో మూల్యాంకనం దేన్ని నిర్ధారించే దిశగా సాగుతుంది ?
ఎ) విద్యార్థులను లేబుల్‌ చేయడం
బి) విద్యార్థుల బలాలు మరియు అవసరాలను అంచనా వేయడం
సి) వైకల్యాలున్న విద్యార్థులను మినహాయించడం
డి) ప్రధాన స్రవంతి తరగతి గదుల నుండి విద్యార్థులను వేరు చేయడం
11. ”నోలన్‌” ప్రకారం పాక్షిక దష్టి లోపం కలిగిన పిల్లలు నిమిషానికి ఎన్ని పదాలు నేర్చుకోగలుగుతారు ?
ఎ) నిమిషానికి 100 పదాలు
బి) నిమిషానికి 75 పదాలు
సి) నిమిషానికి 62 పదాలు
డి) నిమిషానికి 120 పదాలు
12. ఒక విద్యార్ధి కథా రూపంలో ఉన్న పాఠ్యాంశాన్ని గేయ రూపంలో సొంతంగా రచించాడు. ఇది ఏ విద్యా ప్రమాణానికి సూచికగా నిలుస్తుంది ?
ఎ) స్వీయ రచన బి) సజనాత్మకత
సి) సాహిత్య సష్టి డి) భాషోపయోగం
13. ఈ కింది వాటిలో నిరంతర సమగ్ర మూల్యంకనలో లేనిది ఏమిటి ?
ఎ) ప్రాయోగికత బి) లక్ష్యాధారిత
సి) అసమగ్రత డి) సమ్యత
14. నవజాత శిశువు యొక్క ఏడుపు దేనికి భావ సూచికగా భావించవచ్చు ?
ఎ) ఉద్వేగ వికాసం బి) బాషా వికాసం
సి) శారీరక వికాసం డి) సామాజిక వికాసం
15. వికాస సామీప్య మండలం అన్న భావనని ప్రతిపాదించింది ఎవరు?
ఎ) బ్రోన్‌ ఫెన్‌ బ్రెన్నేర్‌ బి) ఫియాజ్‌
సి) వైగోస్కీ డి) బ్రియాన్‌
16. 1905 లో మొట్టమొదటిసారిగా ప్రజ్ఞ్యా నికషకు రూపకల్పన చేసింది ఎవరు ?
ఎ) బ్రెన్నేర్‌ బి) ఫియాజ్‌
సి) వైగోట్‌ స్కీ డి) అల్ఫ్రెడ్‌ బినే
17. ఈ కింది వాటిలో ఏది ప్రాధమిక స్థాయిలో సంభాషణ రూపంలో ఉన్న పాఠ్యాంశాన్ని భోదించడానికి ఉత్తమ పద్ధతి ?
ఎ) ప్రశ్నోత్తర పద్ధతి బి) వివరణ పద్ధతి
సి) కథాకథన పద్ధతి డి) విచారణ పద్ధతి
18. ఆంధ్రప్రదేశ్‌ బాలల ఉచిత మరియు నిర్బంధ విద్య నియమాలు 2010 దీనికి సంబంధించిన నిబంధనలు మరియు ప్రమాణాలను నిర్దేశిస్తుంది:
ఎ) పాఠశాలల్లో ఆరోగ్య సంరక్షణ
బి) ఉపాధ్యాయుల నియామకం
సి) పాఠశాల మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాలు
డి) పాఠ్యాంశాల అభివద్ధి
19. ఎలిమెంటరీ స్థాయిలో బాలికల విద్య కోసం ఏర్పాటు చేయబడిన జాతీయ కార్యక్రమం (చీూజు+జుూ) ప్రధానంగా వేటిపైన దష్టి పెడుతుంది ?
ఎ) బాలికలను విద్య నుండి మినహాయించడం
బి) విద్యలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం
సి) బాల్య వివాహాలను ప్రోత్సహించడం
డి) బాలికల్లో డ్రాపౌట్‌ రేట్లు పెరగడం
20. సబల పధకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ?
ఎ) కౌమార దశలోని బాలికల్లో సాధికారతను పెంపొందించటం
బి) గ్రామీణ ప్రాంత బాలికల్లో జీవన విలువలని పెంపొందించటం
సి) గిరిజన ప్రాంత బాలికల్లో సాధికారతను పెంపొందించటం
డి) పట్టణ ప్రాంత బాలికల్లో విలువలు పెంపొందించటం
21. బుద్ధిమాంధ్యత ఉన్న పిల్లలకు క్రిక్‌-జాన్సన్‌ ప్రకారం విద్యా ప్రణాళిక కానిది ఏది ?
ఎ) సమైక్య విధానం బి) గహ శిక్షణ
సి) ప్రత్యామ్నాయ స్కూల్‌ నమూనా
డి) ఆశ్రమ పాఠశాల
22. క్రిటికల్‌ థియరీ దక్కోణం ప్రకారం, విద్య దేనికి సాధనంగా పనిచేస్తుంది ?
ఎ) సామాజిక పునరుత్పత్తికి ఒక సాధనం
బి) వ్యక్తిగత పురోగతికి ఒక సాధనం
సి) సాంస్కతిక విలువల ప్రతిబింబం
డి) స్వీయ-ఆవిష్కరణ ప్రక్రియ
23. డేవిడ్‌ కోల్బ్‌ ప్రతిపాదించిన అనుభవపూర్వక అభ్యాస సిద్ధాంతం యొక్క ముఖ్య ఆలోచన ఏమిటి?
ఎ) నేర్చుకోవడం అనేది ఒక సామాజిక ప్రక్రియ
బి) అభ్యాసం అనేది నిర్దిష్ట అనుభవాలతో కూడిన క్రియాశీల ప్రక్రియ
సి) నేర్చుకోవడం అనేది ప్రధానంగా ఉపబల ఫలితంగా ఉంటుంది
డి) నేర్చుకోవడం అనేది సమాచారాన్ని స్వీకరించే నిష్క్రియ ప్రక్రియ
24. విద్యని కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో చేర్చడానికి దోహదపడ్డ రాజ్యాంగ సవరణ ఏది ?
ఎ) 74వ రాజ్యాంగ సవరణ
బి) 34వ రాజ్యాంగ సవరణ
సి) 24వ రాజ్యాంగ సవరణ
డి) 42వ రాజ్యాంగ సవరణ
25. 2024 కేంద్ర బడ్జెట్‌లో పాఠశాల విద్యకి ఎంత మొత్తం కేటాయించారు?
ఎ) 68, 804 కోట్లు బి) 44, 094 కోట్లు
సి) 86. 804 కోట్లు డి) 42, 804 కోట్లు

సమాధానాలు
1. సి 2. డి 3. బి 4. బి 5. సి 6. బి 7. బి 8. ఎ 9. బి 10. బి 11. ఎ 12. బి 13. సి 14. ఎ 15. సి 16. డి 17. సి 18. సి 19. బి 20. సి 21. సి 22. ఎ 23. బి 24. డి 25. ఎ

డాక్టర్‌ కె. శశిధర్‌
పర్యావరణ నిపుణులు
94919 91918

Spread the love