జీఎంపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు
కిల్లె గోపాల్, ఉడుత రవీందర్
నవతెలంగాణ -భువనగిరి కలెక్టరేట్
అమరవీరుల ఆశయ సాధనకు పునరంకితమవుదామని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిల్లె గోపాల్, ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ పిలుపునిచ్చారు. గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అమరుల స్ఫూర్తి యాత్ర మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా నాయకులు భువనగిరి మండలం బస్వాపురం మాజీ సర్పంచ్ రాసాల వెంకటేశం, బొమ్మాయిపల్లి మాజీ సర్పంచ్ బండి రాములు ఇండ్ల వద్దకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ.. బండి రాములు సంఘం భువనగిరి డివిజన్ అధ్యక్షులుగా, రాసాల వెంకటేశం జిల్లా కమిటీ సభ్యులుగా పని చేశారన్నారు. భువనగిరి మండలంతోపాటు పరిసర గ్రామాల్లో ఆనాడు గొల్ల, కురుమలను ఐక్యం చేసి.. సొసైటీల నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. ఈ గ్రామాల్లో గొల్లకురుమలు ఇప్పటికీ జీఎంపీఏస్ తోనే ఉన్నారని చెప్పారు. గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్, రాష్ట్ర నాయకులు చల్ల మల్లయ్య, కడెం లింగయ్య, జిల్లా గౌరవాధ్యక్షులు బండారు నర్సింహ్మ, అధ్యక్షులు మద్దెపురం రాజు, కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ, ఉపాధ్యక్షులు బుడుమ శ్రీశైలం, మద్దెపురం బాలనర్సింహ్మ, సహాయ కార్యదర్శి కొండె శ్రీశైలం, జిల్లా కమిటీ సభ్యులు గునమోని అయిలయ్య, బీమనబోయిన బాలరాజు, మండల అధ్యక్షులు దేవునూరి బాలయ్య, కార్యదర్శి పాక జహాంగీర్, కల్లుగీత కార్మిక సంఘం మండల కార్యదర్శి మచ్చ బాస్కర్, సొసైటీ అధ్యక్షులు రాసాల బాల మల్లయ్య పాల్గొన్నారు.
అమరుల ఆశయ సాధనకు పునరంకితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



