వండర్‌ఫుల్‌ విజువల్‌ ట్రీట్‌

డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి వస్తున్న తొలి చిత్రం ‘హను-మాన్‌’. తేజ సజ్జా కథానాయకుడిగా ఈ చిత్రాన్ని శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌ టైన్‌మెంట్‌ పై కె నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ మీడియాతో మాట్లాడుతూ, ‘క్వాలిటీ పరంగా రెడీ అనుకున్నప్పుడు జూలై ఫస్ట్‌ వీక్‌లో రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేస్తాం. టీజర్‌ విడుదల చేసిన తర్వాత అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలని అందుకోవడానికి ఇంకొంత యాడ్‌ చేశాం. అలాగే ఒక క్యారెక్టర్‌ని కూడా యాడ్‌ చేశాం. ఆ పాత్ర చాలా బాగా వచ్చింది. మొదట తెలుగులో అనుకున్నాం. టైటిల్‌ అనౌన్స్‌ చేసిన తర్వాత హిందీ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.
తేజ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసిన తర్వాత తమిళ్‌, కన్నడ, మలయాళం నుంచి రెస్పాన్స్‌ వచ్చింది. హనుమంతుడు కథలో జరిగిన ఒక కీలక సంఘటనతో ఈ సినిమా చేశాం. ఈ సినిమా విషయంలో రాజమౌళి ఇచ్చిన సూచనలు మాకెంతో ఉపయోగపడ్డాయి. ఇదొక విజువల్‌ వండర్‌. ఈ సినిమా తర్వాత బాలకష్ణతో సినిమా ఉండొచ్చు. ‘అధీర’ కూడా సూపర్‌ హీరో ఫిల్మ్‌’ అని అన్నారు.

Spread the love