మట్టిపల్లి సైదులుపై పోలీసుల దాడి అమానుషం

– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి షేక్‌ యాకూబ్‌
గరిడేపల్లి: మోతే మండలం విభాలపురం గ్రామంలో డబల్‌ బెడ్రూం ఇండ్లలో లబ్ధిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలను అరికట్టాలని అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని ఆందోళన చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులుపై పోలీసులు మూకమ్మడిగా దాడి చేయడం అమానుషమని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి షేక్‌ యాకూబ్‌ అన్నారు. మండల పరిధిలోని కీతవారిగూడెం గ్రామశాఖ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డబల్‌ బెడ్రూం ఇండ్ల ఎంపికలో రాజకీయ జోక్యం ఉండకూడదని సామరస్యంగా ఆందోళన చేస్తున్న సీపీఐ(ఎం) నాయకులపై బీఆర్‌ఎస్‌ నాయకుల ప్రోత్సాహంతోనే పోలీసులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసును ఎత్తు వేయాలని అర్హులైన పేదల లిస్టు ఫైనల్‌ చేసి వారికి ఇండ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్‌ నాయకులు హుస్సేన్‌, సైదయ్య, బొల్లెపల్లి శ్రీనివాస్‌, రాజేష్‌, నారాయణ, పెంటయ్య, నాగరాజు, వెంకటేశ్వర్లు, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love