మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

నవతెలంగాణ – హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం కోసం ఎక్సైజ్ కేసుల్లో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీశ్ సిసోడియాకు శనివారం ఊరట లభించలేదు. ఆయన పిటిషన్ పై తీర్పును కోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. గుజరాత్ లో పార్టీ లోక్ సభ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టే స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సిసోడియా కూడా ఉన్నారు. ఈ జాబితాలోని ఇతర స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ లో ఇదే కేసులో జైలుపాలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్ కూడా ఉన్నారు.

Spread the love