అయ్యా బాంచన్ బతుకులు పోవాలి: విజయశాంతి

నవతెలంగాణ- మోర్తాడు

రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఆయాంలో ప్రజలు అయ్యా బాంచన్ అనే విధంగా జీవన విధానం సాగించాల్సి వస్తుందని ఆ విధానం నీకు సాగనంపుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కివ్వాలని అన్నారు. మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ కార్నర్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ వేల కోట్ల రూపాయలను సంపాదించుకుంటూ ప్రజలను బిచ్చగాళ్ళగా మార్చిందని, తెలంగాణ సంపదలను పందికొక్కులుగా దోచుకుంటున్నారని అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ప్రజలను మోసం చేస్తూ వారి కుటుంబ ప్రయోజనాల కోసమే కుటుంబంలో నలుగురికి రాజకీయ పదవులు చేపట్టి ఉద్యోగాలు ఉపాధి నిధులు నియామకాలు లేకుండా ప్రజలందరిని పిండి పీడిస్తూ కోట్ల రూపాయలను సంపాదిస్తూ ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి అయితే తెచ్చి ప్రజలు కోరుకున్న విధంగా పాలనను కొనసాగించే విధంగా అధికారం ఇవ్వాలని అన్నారు. తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజలను ఆ నలుగురే సాసిస్తున్నారని నాలుకోట్ల ప్రజలు అనుకుంటే ఆ నలుగురిన భూస్థాపితం చేయడం సాధ్యమవుతుందని అన్నారు. ప్రభుత్వ వైఫల్యం ప్రశ్నిస్తున్న వారిపై దాడులు దిగుతూ కేసులు నమోదు చేసి అరెస్టు చేయించడం కేసీఆర్ నైజం అని, పకృతి కెసిఆర్ ను భూస్థాపితం చేస్తుందని అన్నారు. భారతదేశంలో బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతిపక్షాలకు పూర్తిస్థాయిలో నిధులు ఇస్తామని అన్నాడంటే ఏ మేరకు దోచుకున్నాడు ప్రజలు గమనించాలని, 420 కోసం బిజెపి కెసిఆర్ ప్రభుత్వం కలిసిపోయింది అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై చేపడుతున్న ఈడీ దాడులు తెలంగాణను దోచుకు తింటున్న టిఆర్ఎస్ నేతలపై ఎందుకు దాడులు చేయడం లేదని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనే బేధం లేకుండా తెలంగాణ ప్రజల పూర్తిగా ఆస్తులను దోచుకుంటూ కోట్ల రూపాయలను సంపాదించుకుంటూ వేలకోట్లతో సెక్రటేరియట్ కట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా లేకుండా ఎందుకు ఉంచారని, రానున్న ఎన్నికల్లో కేసీఆర్ సెక్రెటరీలో కాలు పెట్టకుండా ప్రజల గుణపాఠం చెప్పాలని అన్నారు. కర్ణాటక తరహాలో తెలంగాణలో సైతం కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు చేసి తీరుతామని అన్నారు. సంక్రాంతికి 500 రూపాయల సిలిండర్తో ప్రతి ఒక్కరు తమ అప్పలు చేసుకోవాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో బాల్కొండ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు సూచించారు. తెలంగాణ ప్రజలకు ఇస్తామన్న హామీలను పెండింగ్లో పెట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో పెండింగ్లో పెట్టాలని 1600 కోట్ల రూపాయలతో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు ఎందుకు ఇబ్బందులకు గురవుతుందని, కాంగ్రెస్ హయాంలో 60 సంవత్సరాల క్రితం నిర్మించిన ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఇప్పటికీ నాణ్యత కోడిన విధంగా ఉందని అన్నారు. తెలంగాణలో యువతను గంజాయి వైపు మార్చిన ఘనత అధికార పార్టీని బాల్కొండ నియోజకవర్గం లో యువత గంజాయి వైపు మారేలా చేసిన మంత్రిని ఓడిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని బాల్కొండ కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి అన్నారు. వందలాది మహిళలు భారీ స్వాగతాన్ని చేశారు.
Spread the love