వీర్ బాల్ దివాస్ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన అఖలి సేవక్ జాత 

నవతెలంగాణ – కంటేశ్వర్
వీర్ బాల్ దివస్ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో గాజులపేట్ లో సోమవారం నిర్వహించడం జరిగింది. ఆకలి సేవ జాత సెక్రెటరీ చరణ్ జిత్ సింగ్ ముఖ్యఅతిథిగా దర్శన్ సింగ్ ఆధ్వర్యంలో అమరవీరుల త్యాగానికి గుర్తింపుగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని అఖాలి సేవ జాత గురుద్వారా ఆధ్వర్యంలో శిబిరాన్ని ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో దాదాపు 40 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బుస్సా ఆంజనేయులు శిబిరాన్ని ప్రారంభించారు.  మాట్లాడుతూ బలిదాల వారోత్సవాల సందర్భంగా రక్తాన్ని చిందించకుండా రక్తాన్ని దానం చేయాలని పిలుపునిచ్చారు. అకాలి సేవక్ జాత ఆర్గనైజర్స్ కి రెడ్ క్రాస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అకాల సేవా జాత సెక్రటరీ చరణ్ జీత్ సింగ్, రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, జిల్లా కోశాధికారి కరిపే రవీందర్, డాక్టర్ ఆశిష్ మెడికల్ ఆఫీసర్ రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love