బాకు (అజర్‌బైజాన్): ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో హైదరాబాదీ యువ షూటర్ ఇషాసింగ్ జట్టు విభాగంలో రెండో పసిడి పతకం సాధించింది. ఆదివారం జరిగిన మహిళల, పురుషుల జట్టు ఈవెంట్స్‌లో భారత్ పసిడి పతకాలు సాధించింది. పురుషుల రైఫిల్ 3పీలో 0.1 తేడాతో సిల్వర్ చేజార్చుకున్న అఖిల్ షెరాన్.. ఒలింపిక్ బెర్త్‌ను మాత్రం వదల్లేదు. షూటింగ్‌లో భారత్‌కు లభించిన ఐదో ఒలింపిక్స్ బెర్త్ ఇది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఇషా (581 పాయింట్లు), మనుభాకర్ (580), రిథమ్ సంగ్వాన (583) బందం 1744-1743 తో చైనీస్ తైపీను ఓడించింది. పురుషుల 3పీ టీమ్ ఈవెంట్‌లో అఖిల్, ప్రతాప్ సింగ్ తోమర్, నీరజ్ కుమార్ త్రయం 1750 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి, స్వర్ణం కైవసం చేసుకుంది.