ఇంటర్నేషనల్‌ నృత్య పోటీల్లో అక్షితకు మొదటి బహుమతి

నవతెలంగాణ-జూబ్లీహిల్స్‌
నగరానికి చెందిన అడుసుమిల్లి అక్షిత ఈ నెల 14వ తేదీన దుబారులో జరిగిన ఇంటర్నేషనల్‌ శోభా నాయుడు అవార్డ్స్‌-2023 నృత్య పోటీల్లో పాల్గొని సీనియర్‌ కేటగిరీలో మొదటి బహుమతి సాధించారు. ఈ నృత్య పోటీలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కల్చర్‌ అండ్‌ టూరిజం శాఖ వారి ఆధ్వర్యంలో ప్రణవ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కూచిపూడి డాన్స్‌ వారు దుబారులోని ఇండియన్‌ కాన్సులేట్‌ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ పోటీలో దేశ విదేశాల నుంచి సుమారు 200 మంది నృత్య కళాకారులు పాల్గొన్నారు. కుమారి అక్షిత తన ఏడవ ఏట నుంచి పద్మశ్రీ డాక్టర్‌ జి.పద్మజా రెడ్డి వద్ద కూచిపూడి నృత్యం అభ్యసించి, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ నృత్య పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు, ప్రశంసలు పొందినది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారు 2022లో నిర్వహించిన కూచిపూడి సర్టిఫికేషన్‌ పరీక్షలో డిస్టిప్షన్లో ఉత్తీర్ణత సాధించింది సుమారు వందకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను అలరించింది. ఎన్సిసీలో పాల్గొని 2021లో ఏపీ, తెలంగాణ డైరెక్టర్‌ రేట్‌ బెస్ట్‌ క్యారెట్‌గా ఎంపికైనంది. ఎంపిక అయింది.

Spread the love