హైదరాబాద్ ప్రయాణికులకు అలర్ట్…

నవతెలంగాణ – హైదరాబాద్
హైదరాబాద్ ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్. వారం పాటు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు కానున్నాయి. ఈ నెల 26 నుంచి జూలై 2 వరకు 22 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. లింగంపల్లి-హైదరాబాద్, ఉందానగర్-లింగంపల్లి, ఫలక్ నుమా-లింగంపల్లి స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ రైళ్ళను నిలిపివేయనున్నారు. ఈ మార్గాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు కానున్న తరుణంలో.. ప్రయాణికులు సహకరించాలని కోరారు రైల్వే అధికారులు.

Spread the love