ప్రమాదకరంగా ఆలేరు మంతపురి రోడ్డు

నవతెలంగాణ -ఆలేరుటౌన్‌
ఆలేరు నుండి మున్సిపాలిటీలో భాగమైన బహదూర్‌ పేట మంతపురి మీదుగా వెళ్లే రోడ్డుపై పెద్ద గుంతలతో అత్యంత ప్రమాదకరంగా తయారైంది. ఐదేండ్ల నుండి ఈ రోడ్డు మరమ్మతులకు నోచుకోకపోవడంతో నిత్యం వందలాది భారీ వాహనాల రద్దీ వల్ల పూర్తిగా ధ్వంసమై ంది. వర్షం పడినప్పుడు గుంతల్లో నీరు నిలిచి వాహనదారులకు మరింత ఇబ్బందిగా మారుతుంది. ఈ దారి గుండా ప్రయాణం చేయాలంటేనే వాహనాదారులు జంకుతున్నారు. వాహనదారులు ప్రమాదాల బారిన పడి గాయాలపాలైన సంఘటనలు అనేకము న్నాయి. రహదారి గుండా తరచూ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ప్రయాణిస్తున్న చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ,రాత్రి వేళలో అయితే ఎదురుగా వచ్చే భారీ వాహనాల వెలుతురుకు గుంతలు కనిపించక తప్పించబోయి సైకిలిస్టులు, ద్విచక్ర వాహనదారులకి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. .ఇదే దారిలో ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ సైతం ఉంది. ఈ రోడ్డు అభివద్ధికి నోచుకోలేకపోవడం విచారకరమని ప్రజలు చర్చించుకుంటున్నారు. రోడ్డును బాగు చేసి సమస్యలు తీర్చాలని పలుమార్లు స్థానికులు వినతులు ఇచ్చిన పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. గతంలో ఆర్‌ అండ్‌ బి అధికారులు రోడ్డును పరిశీలించి నప్పటికీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఇప్పటికైనా తక్షణమే నిధులు మంజూరు చేసి రోడ్డుతో పాటు ఈ దారిలో ఉన్న లో లెవెల్‌ కాజువేల స్థానంలో హైలెవెల్‌ కాజువేలు నిర్మించాలని కోరుతున్నారు.

Spread the love