45వ వార్డు ప్రజలంతా బీఆర్ఎస్ వైపే..

– వ్యక్తులు వెళ్లినంత మాత్రాన పార్టీకి నష్టం లేదు..
– ఏ నాయకుడు చేయని అభివృద్ధి జగదీష్ రెడ్డి వల్లే సాధ్యం..
– హ్యాట్రిక్ విజయం ఖాయం.. బీఆర్ఎస్ జిల్లా నాయకులు బండారు రాజా..
నవతెలంగాణ- సూర్యాపేట
45వ వార్డు ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని, నాయకులు మారినంత మాత్రాన పార్టీకి నష్టం లేదని జిల్లా బీఆర్ఎస్ నాయకులు బండారు రాజా అన్నారు. ఆదివారం స్థానిక 45 వ వార్డులో పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేలకోట్ల రూపాయలతో జిల్లాను రాష్ట్రంలోనే మంత్రి జగదీష్ రెడ్డి అగ్రగామిగా నిలిపారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్, మినీ ట్యాంక్ బండ్, ఐటి హబ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణంతో జిల్లా రూపు రేఖలే మారాయన్నారు. 24 గంటల విద్యుత్ తో పాటు, మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు అందిస్తున్నారని కొనియాడారు. 45 వార్డు ప్రజలు కార్యకర్తలు బీఆర్ఎస్ వెంట ఉన్నారని ఎవరు ఆందోళన చెందవద్దని తెలిపారు. సూర్యాపేటలోని  45వ వార్డు ప్రజలంతా కలిసి మంత్రి జగదీశ్ రెడ్డి నీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్  సాధిస్తామని అన్నారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ,45 వ వార్డు అధ్యక్షులు కుక్కడపుసాలయ్య, మాజీ కౌన్సిలర్లు ఉప్పల సంపత్ కుమార్, సయ్యద్ సలీం, నాయకులు నూకల వెంకట్ రెడ్డి, ముప్పారపు నాగేశ్వరరావు, కుక్కడపు బిక్షం, వెంకటేష్, దేవి రెడ్డి రవీందర్ రెడ్డి, మిట్టపల్లి రమేష్ నల్లపాటి రమేష్, మంజుల, లతీఫ్ బాబా, పాపయ్య గౌడ్, రంగారావు తదితరులు పాల్గొన్నారు.
Spread the love