మంత్రులకు ఛాంబర్స్‌ కేటాయింపు

మంత్రులకు ఛాంబర్స్‌ కేటాయింపునవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ఆయా శాఖల మంత్రులకు ఛాంబర్స్‌ కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్‌ శాఖల మంత్రి మల్లు భట్టివిక్రమార్కకు సచివాలయంలోని రెండో అంతస్తులో 10,11,12 గదులను కేటాయించారు. ఇరిగేషన్‌, పౌరసరఫ రాల శాఖ శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి నాల్గవ అంతస్తులో రూమ్‌ నెంబర్లు 27, 28, 29 కేటాయించారు. ఆరోగ్యం, కుటుంబసంక్షేమం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజనర్సింహాకు రెండో అంతస్తులో 13,14,15 గదులు కేటాయించారు. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఐదో అంతస్తులో 10,11,12 రూంలు కేటాయించారు. ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబుకు మూడో అంతస్తులో 10, 11, 12 నెంబర్ల గదుల్ని కేటాయించారు. రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 10, 11, 12 నెంబర్ల రూములు ఇచ్చారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఐదో అంతస్తులో రూం నెంబర్లు 27, 28, 29 కేటాయించారు. పర్యావరణం, దేవాదాయ, అటవీశాఖల మంత్రి కొండా సురేఖకు నాల్గవ అంతస్తులో 10, 11, 12 నెంబర్ల రూములు కేటాయించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డీ అనసూయ సీతక్కకు మొదటి అంతస్తులో 27, 28 29 గదుల్ని కేటాయించారు. వ్యవసాయం, మార్కెటింగ్‌, సహకారం, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మూడో అంతస్తులో 27, 28, 29 గదుల్ని ఇచ్చారు. మద్యపాన నిషేధం, ఎక్సైజ్‌, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావుకు నాల్గవ అంతస్తులో 13, 14, 15 నెంబర్ల గదుల్ని కేటాయించారు. ఈ సమాచారాన్ని ఆయా శాఖలు, విభాగాల ఉన్నతాధికారులకు అందించారు.

Spread the love