రాంపూర్ గ్రామపంచాయతీ ఏర్పాటుకు ఆమోదం

నవతెలంగాణ-గోవిందరావుపేట
రాంపూర్ గ్రామపంచాయతీ ఏర్పాటుకు అంతా ఓకే అయింది. బుధవారం మండలంలోని పసర గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్ బద్దం లింగారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో ప్రజా తీర్పు అశేష ప్రజానీకం హాజరై చేతులెత్తి ఆమోదం తెలిపారు. ముందుగా గ్రామపంచాయతీ కార్యాలయం ముందు అధికారులంతా ఆసీనులై ఉండగా పంచాయతీ కార్యదర్శి గ్రామసభ నిర్వహణపై ప్రజలకు వివరించారు. ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ గిరిజనేతర ప్రాంతమైన రాంపూర్ గ్రామస్తులు గతంలో పసర నాగారం షెడ్యూల్ పంచాయతీ పరిధిలో ఉంటూ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామంటూ రాంపూర్ ప్రత్యేక పంచాయతీ ఏర్పాటుపై మార్చి 27న జిల్లా పంచాయతీ అధికారికి అర్జీ పెట్టుకున్నారని ఏప్రిల్ 4న జిల్లా పంచాయతీ అధికారి మౌఖిక ఆదేశానుసారం విచారణ చేయమని చెప్పగా ఈరోజు పసరా నాగారం పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామసభ కు సంబంధిత వ్యక్తులు పూర్తి సమాచారంతో సర్పంచ్ తో సహా వార్డు సభ్యులు హాజరుకావాలని తెలియపరచడం జరిగిందన్నారు. గ్రామ సభకు హాజరైన ప్రజానీకం అధికారులు సూచించిన విధంగా చేతులు ఎత్తే పద్ధతి ద్వారా కానీ సంతకాల ద్వారా గాని తమ అభిప్రాయాలను తెలియపరచవచ్చని అన్నారు. ఎస్ఐ సిహెచ్ కరుణాకర్ రావు మాట్లాడుతూ కేవలం అభిప్రాయ సేకరణ కొరకు మాత్రమే గ్రామ సభ జరుగుతుందని ఎవరైనా ఎలాంటి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నం చేసిన ప్రభుత్వ నిబంధనల ప్రకారం చట్ట ప్రకారంగా శిక్ష అరుపులని అన్నారు. అనంతరం గ్రామసభలో పంచాయితీ ఏర్పాటుపై ప్రజలను తీర్పుకోరగా హాజరైన జనం ముకుమ్మడిగా చేతులు పైకెత్తి అనుకూల సంకేతం ఇచ్చారు. అనంతరం సంతకాలు సేకరించి అధికారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి, డిప్యూటీ తాహసిల్దార్ మమత, ఎంపీ ఓ సాజిదా బేగం, పంచాయతీ కార్యదర్శి పి శరత్ బాబు, వార్డు సభ్యులు కోఆప్షన్ సభ్యులు ప్రజలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love