రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సమావేశం

నవతెలంగాణ-గోవిందరావుపేట
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై గురువారం ఉదయం 10 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ జూన్ 2 నుండి జూన్ 22 వరకు రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల పరిషత్ అధ్యక్షులు మరియు జెడ్పిటిసి, సమస్త సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్షన్ నెంబర్లు, మండల స్థాయి అధికారులు జిపి స్పెషల్ అధికారులు పంచాయతీ కార్యదర్శులు అందరూ సకాలంలో ఈ సమావేశానికి హాజరు కావాలని కోరుతున్నట్లు తెలిపారు.

Spread the love